AP SSC Exams results 2025: ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే

AP 10th class results links: ఏపీ సర్కారు 10వ తరగతి ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది.

Update: 2025-04-21 17:00 GMT

AP SSC Exams results 2025: ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే

AP SSC Results 2025: ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏపీ సర్కాకు పదో తరగతి ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 23వ తేదీన 10వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఏపీ విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్స్ https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. వాట్సాప్‌లో మన మిత్ర లేదంటే లీప్ యాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉందని విజయ్ రామరాజు గుర్తుచేశారు.

అంతేకాకుండా వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపించడం ద్వారా కూడా ఏపీ ఎస్ఎస్‌సీ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇవేకాకుండా అనేక ఇతర ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు తమ వెబ్‌సైట్స్ ద్వారా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ అందిస్తున్నాయి.

ఇక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల విషయానికొస్తే, వారు తమ స్కూల్ క్రెడెన్షియల్స్ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా విద్యార్థుల ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. 

Tags:    

Similar News