AP Govt: రాజధాని కేసులు తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్‌ లేఖ

AP Govt: ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని కోరిన ప్రభుత్వ న్యాయవాది

Update: 2023-02-04 13:30 GMT

AP Govt: రాజధాని కేసులు తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్‌ లేఖ

AP Govt: రాజధాని కేసులు తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్‌ లేఖ పంపింది. ఈ మేరకు వెంటనే మెన్షన్‌ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారుకు లేఖ పంపారు అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ మెహఫూజ్‌ నజ్కీ. 6వ తేదీ ఉదయం మెన్షన్‌ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారును అభ్యర్థించారు అడ్వకేట్‌ నజ్కీ. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు అధికారం లేదని పేర్కొన్న అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించింది ఏపీ సర్కార్‌. 31న బెంచ్‌ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ఈనెల 6న మెన్షన్‌ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. 

Tags:    

Similar News