AP News: ఏపీ డీఏ చెల్లింపు ఆదేశాల్లో మార్పులు
AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డీఏ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
AP News: ఏపీ డీఏ చెల్లింపు ఆదేశాల్లో మార్పులు
AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డీఏ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజున విడుదల చేసిన జీవోలో మార్పులు చేస్తూ తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సవరణ జీవో ప్రకారం, డీఏ బకాయిలలో 10 శాతం మొత్తాన్ని 2026 ఏప్రిల్‌లో చెల్లించనున్నారు. మిగిలిన 90 శాతం మొత్తాన్ని మూడు వాయిదాల్లో ఉద్యోగులకు ఇవ్వనున్నారు.
ఓపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. సీపీఎస్, పీటీడీ ఉద్యోగులకు మాత్రం 90 శాతం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ సవరణలపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్పులు చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.