ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితా.. 11న ప్రమాణస్వీకారం...
AP New Cabinet: ఎప్పుడు ఫోన్ వస్తుందోనని ఆశావాహుల్లో ఉత్కంఠ
ఈ నెల 10న కొత్త మంత్రుల జాబితా.. 11న ప్రమాణస్వీకారం...
AP New Cabinet: ఏపీలో ఈనెల 11న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.. ఎల్లుండి కొత్త మంత్రుల జాబితా వెలువడే అవకాశం ఉంది. దీంతో తమకు ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందోనని ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా చేసి సీఎం జగన్ కు లేఖలను అందజేశారు.
అయితే మరోసారి పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్, విజయనగరం నుంచి భాగ్యలక్ష్మీ, రాజన్న దొర, అనంతపురం నుంచి జొన్నలగడ్డ పద్మావతి, గుంటూరు నుంచి విడదల రజినీ, చిత్తూరు నుంచి రోజాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కన్పిస్తోంది.