AP MLC Results: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

AP MLC Results: 8 స్థానాలకు 139 మంది పోటీ

Update: 2023-03-16 03:01 GMT

AP MLC Results: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

AP MLC Results: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. మొత్తం 8 స్థానాలకు 139 మంది అభ్యర్థుల బరిలో నిలవగా పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో గెలుపు ఓటములు అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున నెలకొంది. ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల, మూడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగగా కౌంటింగ్ కొనసాగుతోంది.

కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా రెండు రోజుల పాటు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతానికంటే భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థులు అధికంగా నిలవడం విపక్షాలు అటు అధికార పక్షంతో పాటు స్వతంత్రులు సైతం బరిలో నిలవడంతో అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. దీంతో కౌంటింగ్ 2 రోజులు పాటు కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News