Nara Lokesh: జగన్ మాదిరి తల్లినీ, చెల్లినీ రోడ్లపైకి గెంటివేసే రకం కాదు- నారా లోకేష్
Nara Lokesh: గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు వైసీపీ సృష్టేనని ఆరోపించారు ఏపీ మంత్రి నారా లోకేష్
Nara Lokesh
Nara Lokesh: గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు వైసీపీ సృష్టేనని ఆరోపించారు ఏపీ మంత్రి నారా లోకేష్. వారి హయంలో కుంభకోణాలను పక్కదారి పట్టించడానికే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని విద్యార్థుల బాధ్యత తనదేనన్నారు లోకేష్. జగన్ మాదిరి తల్లినీ, చెల్లినీ రోడ్లపైకి గెంటివేసే రకం కాదని విమర్శించారు.
కాలేజీలో నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన పర్సనల్ మ్యాటర్‌ను హిడెన్ కెమెరాలకు లింక్ చేస్తున్నారని అన్నారు. వివాదానికి కారణమైన విద్యార్థులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.