Audimulapu Suresh: విద్యార్థుల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యత
Audimulapu Suresh: 15-18 ఏళ్లలోపు విద్యార్థులు, టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం
విద్యార్థుల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యత
Audimulapu Suresh: విద్యార్థుల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి సెలవుల తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందన్నారు.15 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి సురేష్ తెలిపారు. వచ్చే 15 రోజులు కరోనా ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో అన్ని చర్యలు చేపట్టామన్నారు మంత్రి సురేష్.