స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు-అవంతి
*ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తట్టుకోలేరు-అవంతి శ్రీనివాస్ *స్టీల్ ప్లాంట్ ఉద్యమం రైతు ఉద్యమం కంటే పది రెట్లు ఉంటుంది-అవంతి
Aavanthi srinivasa rao
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. విశాఖ ఉద్యమం రైతుల ఉద్యమం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని ఇప్పటికే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారని..బీజేపీ, జనసేన నేతలు కూడా ప్రధానిని కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన తెలపాలని అవంతి సూచించారు.