AP Jr doctors File image
AP Junior Doctors: ఏపీలో జూడాలు సమ్మె విరమించారు. ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ముఖ్యకార్యదర్శి జూడాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, కాబట్టి సమ్మె విరమిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. భద్రత కల్పించడంతోపాటు కొవిడ్ ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా, స్టైఫండ్ ఇవ్వాలని, ఆసుపత్రులలో తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్ల అందోళనకు దిగిన సంగతి తెలిసిందే.