Andhra Pradesh: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే.

Andhra Pradesh: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సామాజిక వ‌ర్గంపై గ‌త కొ్న్ని రోజులుగా వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2021-04-16 15:30 GMT

పుష్ప శ్రీవాణి ఫైల్ ఫోటో 

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సామాజిక వ‌ర్గంపై గ‌త కొ్న్ని రోజులుగా వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వివాదానికి నేటితో ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ల‌యింది. పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని విచారణ కమిటీ (డీఎల్ఆర్ సీ) తేల్చింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కొండదొర కులానికి చెందినవారని నిర్థారించింది. ఎన్నిక‌ల అఫిడివెట్ లో పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్‌ఎస్‌సీ ప్రకటించింది. కోర్టు సూచనతో డీఎల్‌ఎస్‌సీ ఛైర్మన్‌ పుష్ప శ్రీవాణి కులంపై జిల్లా స్థాయి నిర్థారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు.

శ్రీవాణి నిజమైన ఎస్టీ కొండదొర కులస్తురాలని విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, ఉప ముఖ్యమంత్రి కులంపై కులంపై శ్రీవాణి గిరిజనురాలు కాదంటూ గతంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విచారణ జరిపిన కోర్టు విచారణ జరపాలని ప.గో.జిల్లా డీఎల్‌ఎస్‌సీకి సూచించింది. నివేదికను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.

Tags:    

Similar News