Guntur: రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత

* రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం పత్రాలు అందజేత * రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు

Update: 2021-09-11 13:45 GMT

రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత (ఫోటో ది హన్స్ ఇండియా )

Guntur: గుంటూరులో నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య కుటుంబ సభ్యులను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. రమ్య కుటుంబ సబ్యులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం పత్రాలను అంద చేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. రమ్య హత్యోదంతం బాధాకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

త్వరలో రమ్య సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పాలడుగు సామూహిక అత్యాచార ఘటనపై విచారణ కొనసాగుతుందని కొన్ని ఆధారాలు దొరికాయన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హోంమంత్రి సుచరిత చెప్పారు.

Tags:    

Similar News