నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..

AP High Court: నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

Update: 2022-11-24 11:41 GMT

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీబీఐ విచారణకు ఆదేశం..

AP High Court: నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. సాక్ష్యాల ఫైల్స్ చోరీపై సీరియస్ అయిన ఉన్నత న్యాయస్థానం కేసు తదుపరి విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకె. మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మంత్రి కాకాణికి సంబంధించిన కేసు ఫైల్స్ చోరీకి గురయ్యాయి. ఈవ్యవహారంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ నేతలు కావాలనే తమకు సంబంధించిన ఫైల్స్ మాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు. కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News