రఘురామరాజును విచారించడానికి సీఐడీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
*ఆయన లాయర్ సమక్షంలోనే విచారణకు అనుమతి
రఘురామరాజును విచారించడానికి సీఐడీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
AP High Court: MP రఘురామకృష్ణరాజుపై AP CID నమోదు చేసిన కేసును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది. ఆయనపై నమోదైన రాజద్రోహం నేరం మినహా ఇతర సెక్షన్ల కింద విచారణ జరుపుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో రఘురామరాజు లాయర్ సమక్షంలో విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
కేవలం కేసుకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే విచారణ జరపాలని, ఇతర అంశాల గురించి ప్రశ్నించకూడదని సూచించింది. CID కార్యాలయానికి పిలిపించకూడదని చెప్పింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని ఆదేశించింది.