వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ: ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ: ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన విజయవాడ జైలులో ఉన్నారు.2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారని అప్పట్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్ ఈ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ 71 నిందితుడిగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న వంశీని ఫిబ్రవరి 18న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. రాజకీయ కక్షతోనే వంశీపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.