AB Venkateshwara Rao: హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన..

Update: 2020-10-01 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి హైకోర్టు ఓ కేసు రిఫరెన్స్ ఇచ్చింది. దాని ప్రకారం కేసు నమోదు చేయకుంటే.. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌ వేయాలని ఏబీకి హైకోర్టు సూచించింది. టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన.. ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కూడా సమర్ధించింది.

సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లారు.. దీంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతోపాటు సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలు చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కనపెట్టిన హైకోర్టు... ఆయనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహించారు.

Tags:    

Similar News