AP High Court: చంద్రబాబుకు హైకోర్టు షాక్‌.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

AP High Court: ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు

Update: 2023-10-09 05:58 GMT

AP High Court: చంద్రబాబుకు హైకోర్టు షాక్‌.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇవి ప్రధానంగా అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల కేసు, ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ కేసులపై పెట్టుకున్న 3 ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో చంద్రబాబుకి హైకోర్టులో నిరాశ ఎదురైంది.

చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురయ్యింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తోసి పుచ్చింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశే ఎదురయ్యింది.

Tags:    

Similar News