Andhra Pradesh: దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు
Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
దేవినేని ఉమా ఫైల్ ఫోటో
Andhra Pradesh: మాజీ మంత్రి దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. సీఐడీ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 7కి వాయిదా వేసింది. ఇప్పటికే సీఐడీ విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు దేవినేని.
మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఏప్రిల్ 15 ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు.. ఈ నెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు.. అందులో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని అభియోగం మోపారు.. ఈ మేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120 బి సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఐడీ విచారణకు హాజరు కాకుండా దేవినేని అజ్ఞాతంలోకి వెళ్లారు.