Andhra Pradesh: ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు

Andhra Pradesh: ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

Update: 2021-10-08 16:30 GMT

Andhra Pradesh: ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు

Andhra Pradesh: ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్‌ చార్జీల నిర్ణయంపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు కావడంతో ఏపీ సర్కార్‌ వెనకడుగు వేసింది. ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని ఈఆర్సీ తెలిపింది. ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్‌కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. హైకోర్టులో పిటిషన్లు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది.

Tags:    

Similar News