Ap High Court: అక్రమ మైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..విచారరణ వాయిదా

Ap High Court: తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

Update: 2024-02-28 13:27 GMT

Ap High Court: అక్రమ మైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..విచారరణ వాయిదా

Ap High Court: గుంటూరు జిల్లా చేబ్రోలులో అక్రమ మైనింగ్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎం.ప్రభుదాస్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రెండు ఎకరాలకే అనుమతి తీసుకున్నారని... 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని... ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడాలు ఉండొద్దని... అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

Tags:    

Similar News