గ్రామ వాలంటీర్లకు ఇంటర్‌, పట్టణ వాలంటీర్లకు డిగ్రీ..

Update: 2019-06-10 15:16 GMT

రాష్ట్రంలో అవినీతి ఎక్కాడా కనపడకూడదని సీఎం జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అవినీతి జోలికి వెళ్లొద్దని మంత్రులను జగన్ హెచ్చరించారని మంత్రి పేర్ని నాని చెప్పారు. కాంట్రాక్టుల్లో జ్యుడిషియల్‌ కమిషన్‌ సూచనలు అమలుచేయాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు తెలిపారు. గ్రామాల్లో వార్డుకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకం చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అవకతవకలకు చోటు లేకుండా గ్రామ వాలంటీర్లను నియమిస్తామని పేర్ని నాని తెలిపారు. ఆగస్టు 15 నాటికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో నియమించే వాలంటీర్లకు ఇంటర్‌ అర్హత ఉండాలని, అలాగే పట్టణాల్లో వాలంటీర్లకు డిగ్రీ అర్హతగా నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వాలంటీర్లకు టెన్త్‌ అర్హత ఉంటే సరిపోతుందన్నారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.

Tags:    

Similar News