AP Government: ఆర్ 5 జోన్ పై సుప్రీంకు జగన్ సర్కార్..

AP Government: ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Update: 2023-08-03 10:01 GMT

AP Government: ఆర్ 5 జోన్ పై సుప్రీంకు జగన్ సర్కార్..

AP Government: ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. R5 జోన్‌‌లో ఇళ్ల నిర్మాణాలపై ఏపీ హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లనుంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. అయితే జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగలగా అత్యున్నత న్యాయస్థానంలోనైనా ఊరట లభిస్తుందా? లేదా? అనేది చూడాలి.

కాగా.. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

Tags:    

Similar News