Kadambari Jethwani Issue: బాలీవుడ్ నటి ఇష్యూపై సర్కార్ సీరియస్.. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు
Kadambari Jethwani Issue: ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
Kadambari Jethwani
Kadambari Jethwani Issue: ముంబై నటి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఉన్నతస్థాయి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐపీఎస్‌ల ప్రమేయం ఉండడంతో... కేసును సీరియస్‌గా తీసుకుంది. ముంబై నటితో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. ఇక ముంబై నటి కేసుపై విజయవాడ సీపీ రాజశేఖర్ స్పందించారు. కేసులో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని.. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని.. ఎంతవరకు వాస్తవం ఉందో లోతుగా తెలుసుకుంటున్నామన్నారు. డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.