Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు
Andhra Pradesh: పేరుమార్పునకు గవర్నర్ ఆమోదంతో ఎన్టీఆర్ పేరు తొలగింపు
Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు
Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు అధికారులు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్టీఆర్ పేరును తొలగించిన అధికారులు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చారు. అలాగే వెబ్‌సైట్‌లోనూ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌గా మార్చారు. ఇకపై అధికారికంగా వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరుతోనే కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు అధికారులు.