అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు.. రేపటిలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశం
Secretariat Employees: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు.. రేపటిలోగా ఫ్లాట్లను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశం
Secretariat Employees: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు వివిధ ప్రాంతాల్లో నాటి ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. రేపటిలోగా భవనాలు ఖాళీ చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. భవనాలను ఎలాంటి రిపేర్లు లేకుండా తిరిగి అప్పగించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని స్పష్టం చేసింది.