Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత
* ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ * ఈనెల 15న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
ఏపీ గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత(ఫైల్ ఫోటో)
Andhra Pradesh: ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.
దీంతో ఆయన 17న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 20, 22 తేదీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో 23న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. మరోసారి అస్వస్థతకు గురవడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.