New Rationcards: ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఇక ప్రజలు రేషన్ కార్డులు తీసుకోవడమే ఆలస్యం. దీనికి సంబంధించి కీలక అప్ డేట్ కూడా ఇచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే రేషన్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే వీలు కలుగుతుందన్నారు. అందువల్ల రేషన్ కార్డుల్లో మార్పులు కోరుకునేవారు మార్చిలో ఈ పని పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకవోడం మేలు అని తెలిపారు. అందుకు తగిన ప్రాసెస్ ను ప్రభుత్వం త్వరలోనే చెబుతుందన్నారు. సాధారణంగా మీ సేవ ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీటిని ఇచ్చేటప్పుడు ప్రభుత్వం డబ్బులు ఏమైనా తీసుకుంటుందా అనే అనుమానం ఉంది. అలాంటిదేమీ ఉండదని తెలిపింది. ప్రభుత్వం డబ్బు తీసుకోకుండానే కొత్తవి ఇస్తోంది. అందువల్ల కొత్త రేషన్ కార్డులు పొందేవారు..ఎలాంటి డబ్బు, లంచం, కమిషన్ ఏదీ ఇవ్వకూడదన్నారు. పాత వాటికి బదులు కొత్త రేషన్ కార్డు ఇవ్వగానే..పాత రేషన్ కార్డులతో ఇక ఎలాంటి పని ఉండదు. కొత్త వాటితోనే పని జరుగుతుంది. ప్రభుత్వ సచివాల ఉద్యోగులే రేషన్ కార్డులు ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి..కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని సమాచారం. అందువల్ల ఈ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కొత్త రేషన్ కార్డుల్లో ఉండే క్యూఆర్ కోడ్ కీలకం. అది చెరిగిపోకుండా జాగ్రత్తగా కార్డును చూసుకోవాలి. ఎందుకంటే రేషన్ షాపుకి వెళ్లాక, ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తారు. దాంతో లబ్దిదారుడి వివరాలు..రేషన్ డీలర్ ట్యాబ్లెట్ లో కనిపిస్తాయి. దాంతో ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చి అప్ డేట్ చేస్తుంటారు. ఇలా ప్రతీనెలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సరుకులు ఇస్తారు. మొత్తంగా మార్చిలో కొత్త రేషన్ కార్డు తీసుకోవాలి. ఎవరికైనా రానట్లయితే..సచివాలయ ఉద్యోగులను అడగాలి. తద్వారా మీ కార్డు మీకు వచ్చేలా చూసుకోవాలి.