శ్రీరామనవమి ఇలా జరుపుకోవాలి... ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో గుంపులు గుంపులుగా బయటికి వెళ్లకూడదని పరిస్థితి ఏర్పడింది.

Update: 2020-03-31 13:57 GMT
sriramanavami celebrations

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో గుంపులు గుంపులుగా బయటికి వెళ్లకూడదని పరిస్థితి ఏర్పడింది. కచ్చితంగా సామాజిక దూరం పాటించాలి. ఈ క్రమంలో ఏప్రిల్ రెండున జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి పలు ఆదేశాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.. పండగ రోజున ఎవరు గుడికి వెళ్ళకూడదనీ , ఆలయ అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనం వాయిదా వేసుకొని ఇంట్లోనే పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఇక అన్ని వైష్ణవ ఆలయాల్లో పూజలు కచ్చితంగా జరుగుతాయని అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించారు. 

Tags:    

Similar News