ఇకనుంచి ఇంజనీరింగ్‌ ఐదేళ్లు, డిగ్రీ నాలుగేళ్లు..

Update: 2019-12-01 02:23 GMT

ఇకనుంచి ఏపీలో ఇంజనీరింగ్‌ ఐదేళ్లు, డిగ్రీ నాలుగేళ్లుగా ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ అంశంపై తగిన నైపుణ్యాలు లేవని ఉన్నత విద్యా శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, అన్ని అంశాలలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఒక సంవత్సరం అప్రెంటిస్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆరవ సెమిస్టర్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులు, ఇతర నైపుణ్యాలలో "లైఫ్ స్కిల్ సిలబస్" ను ప్రవేశపెట్టాలని విద్యా శాఖ కూడా ఆలోచిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News