Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం

Andhra Pradesh: జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం

Update: 2023-01-03 04:46 GMT

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై సభలు, ర్యాలీలు నిషేధించింది. జాతీయ రహదారుల నుంచి పంచాయతీ రాజ్ రోడ్ల వరకు ఈ నిషేధం వర్తించనుంది. దీనికి ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాల్లో.. అత్యంత అరుదైన సందర్భాల్లోనే షరతులతో అనుమతి ఇవ్వాలన్నారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభలో జరిగిన ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. కందుకూరు సభలో 8మంది మృతి చెందితే.. ఆ తర్వాత గుంటూరులో ముగ్గురు చనిపోయారు. పొలిటికల్ సభల కోసం ప్రజలను భారీ సంఖ్యలో తరలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇరుకుగా ఉన్న రోడ్లపై సభలు పెట్టడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సభలు, ర్యాలీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Full View


Tags:    

Similar News