Andhra Pradesh: జూన్ 30 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగింపు
Andhra Pradesh: ఏపీలో కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Emblem of Andhra Pradesh (File Photo)
Andhra Pradesh: ఏపీలో కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30 వరకు మరోమారు సెలవులను పొడిగించింది. ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోన్నుట్లు తెలుస్తోంది.