Andhra News: గవర్నర్‌ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు
Andhra News: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు
Andhra News: గవర్నర్‌ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు
Andhra News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాజ్ భవన్‌కు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని చెప్పారు. చెల్లించకుండా పేరుకు పోయిన బకాయిలు ఎంత మొత్తం ఉన్నాయో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల నుంచి భారీ నిరసనలు చేపడతామని వెల్లడించారు.