AP Covid Vaccine: ఏపీలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
AP Covid Vaccine: ఆంధ్రప్రదేశ్‌లో రేపు బిగ్ వ్యాక్సిన్ డేను నిర్వహించనుంది.
AP Covid Vaccine: (file image)
AP Covid Vaccine: ఏపీలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రేపు బిగ్ వ్యాక్సిన్ డేను నిర్వహించనుంది. కేంద్రం వ్యాక్సినేషన్ బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించింది. సోమవారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ కచ్చితంగా అవసరం లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్ వద్దే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
రేపు ఒక్కరోజు 8 లక్షల డోసులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్యశాఖ అన్ని జిల్లాలకు టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇప్పటి వరకు ఒక్కరోజే 6 లక్షల వ్యాక్సిన్‌లు వేసి ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. రేపు 8 లక్షల డోసులు వేసి చరిత్ర తిరగరాయాలని నిర్ణయించింది జగన్ ప్రభుత్వం