Free Bus Scheme: ఉచితమే కానీ జిల్లాల వరకే.. ఫ్రీ బస్సు పథకంలో ఏపీ సర్కార్ ట్విస్ట్
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళలకు.. ఫ్రీ బస్సు పథకంలో సర్కార్ ఓ ట్విస్ట్ ఇవ్వబోతోంది.
ఉచితమే కానీ జిల్లాల వరకే.. ఫ్రీ బస్సు పథకంలో ఏపీ సర్కార్ ట్విస్ట్
AP Government Twist In Free Bus Scheme
Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళలకు.. ఫ్రీ బస్సు పథకంలో సర్కార్ ఓ ట్విస్ట్ ఇవ్వబోతోంది. రాష్ట్రం మొత్తం కాకుండా కేవలం జిల్లాలకే పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం ఈ పథకం అమలవుతున్న పలు రాష్ట్రాల్లో పర్యటించి నివేదికను కూడా సమర్పించింది. మరోవైపు రవాణా శాఖ అధికారులు సైతం ఈ పథకం వల్ల ఎంత భారం పడుతుందన్నది ఇప్పటికే స్పష్టం చేశాయి. కర్ణాటక, తమిళనాడులో ఉచిత బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ నస్టాల బారిన పడటమే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారిందన్న విషయాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు పథకంలో లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం.. ఈ పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించింది.
ఫ్రీ బస్సు వల్ల తెలంగాణలో పురుషులకు సీట్లు లేకపోవడం, మహిళలే ఎక్కువ మంది బస్సులలో ప్రయాణిస్తుండడంతో సీట్లు కూడా దొరకడంలేదు. పురుషులు మాత్రం డబ్బులు పెట్టి టిక్కెట్టు కొనుక్కోని మరీ.. నిల్చోని ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో పురుషుల్లో అసహనం వ్యక్తమవుతోంది. అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే నిల్చొని వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
అయితే ఫ్రీ బస్సు పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో ఉన్న సమస్యను గుర్తించిన ఏపీ సర్కార్.. కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదనపు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి నష్ట జరగకూడదనే ఉద్దేశంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే ఒక జిల్లాలో ఉండేవారు ఆ జిల్లా వరకు మాత్రమే బస్సులో ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. వేరే జిల్లాకు వెళ్లాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనన్న ప్రతిపాదనను తీసుకురానున్నట్టు సమాచారం. దీని వల్ల ఆర్టీసీకి నష్టం తగ్గడమే కాకుండా సీట్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మరి ప్రభుత్వం నిర్ణయం ఒకే కానీ.. దీని వల్ల సర్కార్ పై ఏమైన వ్యతిరేకత వస్తుందేమో చూడాలి. ఉచిత బస్సు అని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాలకే పరిమితం చేస్తోంది. దీంతో ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న మహిళలు దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.