AP Floods: వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత రేషన్.. సీఎం జగన్మోహన్ రెడ్డి

AP Floods: వరద ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వ్ నిర్వహించారు.

Update: 2020-10-19 15:36 GMT

భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ సోమవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. వరద ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా చూసిన జగన్.. తరువాత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని చెప్పిన ఆయన వరద ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత రేషన్ సక్రమంగా, వేగంగా అందేలా చూడాలని చెప్పారు.

అదే విధంగా, భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం, మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏరియల్‌ సర్వే లో హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ వెంట ఉన్నారు.  

Tags:    

Similar News