Andhra Pradesh: కొత్త విద్యుత్‌ టారిఫ్‌ను ప్రకటించిన ఏపీ ఈఆర్సీ

Andhra Pradesh: ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది.

Update: 2021-03-31 11:27 GMT

Andhra Pradesh: కొత్త విద్యుత్‌ టారిఫ్‌ను ప్రకటించిన ఏపీ ఈఆర్సీ

Andhra Pradesh: ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త టారిఫ్ అమలు కానుంది. సగటు యూనిట్‌ ధరను ఏడు రూపాయల 17 పైసలు నుంచి ఆరు రూపాయల 37 పైసలకు తగ్గించారు. అలాగే, విద్యుత్‌ వాహనాలకు యూనిట్‌ ధరను ఆరు రూపాయల 70 పైసలుగా నిర్ణయించారు.

ఇక, అత్యంత వెనుకపడ్డ వర్గాలకు నెలకు 100 యూనిట్లు ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు నెలకు 200 యూనిట్లు అలాగే, రజకుల లాండ్రీలకు నెలకు 150 యూనిట్లు ఉచితంగా ఇవ్వనున్నారు. అదేవిధంగా రైతులకు అందిస్తోన్న ఉచిత విద్యుత్‌ కోసం 7వేల 297కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించనుంది. అలాగే, గృహ వినియోగదారుల రాయితీల కోసం వ్యయమవుతోన్న 136.72 కోట్లను కూడా ప్రభుత్వమే భరించనుంది.

Tags:    

Similar News