ఐఆర్‌ అంటే.. వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదు: పీఆర్సీ సాధన సమితి నేతలు

AP Employees Union: మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్ మాట్లాడడం వితండవాదం అన్నారు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి.

Update: 2022-02-04 10:25 GMT

ఐఆర్‌ అంటే.. వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదు: పీఆర్సీ సాధన సమితి నేతలు

AP Employees Union: మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్ మాట్లాడడం వితండవాదం అన్నారు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి. పీఆర్సీకి డీఏకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతీ ఉద్యోగికీ కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందని, సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలీదని, ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.

ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఉద్యోగులను బలవంతంగా సమ్మెలోకి నెట్టారన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల చలో విజయవాడను బలప్రదర్శనగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు తమను కుటుంబంలా కాకుండా శత్రువులుగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజకీయా ప్రశంగాలు ఉద్యోగులకు అవసరం లేదని, సమ్మె చేస్తే ఉద్యోగులకు ఆనందం ఎలా అవుతుందని బొప్పరాజు ప్రశ్నించారు.

Tags:    

Similar News