ఆంధ్రప్రదేశ్ నెలలతరబడి ప్రచారాలతో బిజీబిజీగా గడిపిన అభ్యర్థులు.. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కాస్తంత విశ్రాంతిని తీసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో విదేశీ యాత్రలకు వెళ్లడం మేలనే అభిప్రాయానికి అనేకమంది అభ్యర్థులు వచ్చారు. చాలామంది విదేశీ యాత్రలకు వెళ్లి సేద తీరేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.
పోలింగ్‌కు ఫలితాలకు మధ్య ఈసారి చాలా రోజులుండటంతో పక్షం రోజుల పాటు విహార యాత్రలకు వెళుతున్నారు. ముఖ్యంగా అమెరికా, సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాలకు ప్రయాణమయ్యారు. ఎలాగో ఫలితాలు రావడానికి ఇంకా 40 రోజుల సమయం ఉంది కాబట్టి వీలైనన్ని ఎక్కువరోజులు అక్కడ గడపాలని వారు ప్లాన్ చేసుకున్నారు.