Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.
Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయనకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుంటారు. అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక తిరిగి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ద్వారకా తిరుమల మండలంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.