Narayana Swamy: రాజకీయ నేతగా పవన్ అనర్హుడు
*పవన్ కల్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణ ధ్వజం
పవన్ కల్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణ ధ్వజం
Narayana Swamy: మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని చెబుతున్న పవన్ కల్యాణ్ ఏ మొహం పెట్టుకుని మహిళలను ఓట్లు అడుగుతారని డిప్యూటీ సీఎం నారాయణ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాజకీయ నేతగా అనర్హుడని ఆయన్నిప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఒకప్పుడు అమరావతి టిడిపి వాళ్లకు మాత్రమే రాజధాని అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి సైకిల్ గుర్తును చంద్రబాబు లాక్కున్నాడన్న వ్యక్తి ఇప్పుడదే చంద్రబాబుతో దోస్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.