Dr BR Ambedkar Statue: నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
Dr BR Ambedkar Statue: ఒక్కో హాలు విస్తీర్ణం 4,000 చదరపు అడుగులు
Dr BR Ambedkar Statue: నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
Dr BR Ambedkar Statue: ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ.. స్వరాజ్ మైదానంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం నాలుగున్నర గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు.
అక్కడ జరగనున్న సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి స్వరాజ్ మైదానం చేరుకుని.. బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లి నివాసానికి బయల్దేరి వెళ్తారు.
దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి చేసిన సేవలకు గౌరవంగా సీఎం జగన్ 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేశారు. స్వరాజ్యమైదానంలో విగ్రహ పీఠంతో కలిపి దాదాపు 206 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం.. దేశంలో నిర్మించిన విగ్రహాలన్నింటిలోకి ఎత్తైన విగ్రహంగా నిలవనుంది. సీఎం జగన్ చిత్తశుద్ధితో విజయవాడ నగరం నడిబొడ్డున వందల కోట్ల విలువైన స్థలంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం పూర్తి చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేశారు. విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా విగ్రహంతో పాటు స్మృతివనంలో ఏర్పాటు చేసిన గార్డెనింగ్, అంబేద్కర్ చరిత్రను తెలిపే మ్యూజియం, గ్రంథాలయం, మ్యూజికల్ ఫౌంటేన్ వంటివి, కన్వెన్షన్ సెంటర్ వంటి సకల హంగులతో అంబేద్కర్ స్మృతివనం సిద్ధమైంది.