CM Jagan: సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారు

* తిరుమలలో 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు * ఈనెల 11న తిరుమలకు సీఎం జగన్

Update: 2021-10-08 04:45 GMT

సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారు (ఫోటో: ది హన్స్ ఇండియా)

CM Jagan: సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 11వ తేదీన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు సీఎం జగన్. అదేరోజు సాయంత్రం తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలలో 7వ తేది నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 11వ తేదీనే సీఎం జగన్‌ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

Tags:    

Similar News