రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.. 'జగనన్న వసతి దీవెన' ప్రారంభోత్సవంలో సీఎం

రాష్ట్రంలో ప్రతిపక్షంలొో రాక్షసులు ఉన్నారని, వారితో మనం యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

Update: 2020-02-24 09:34 GMT
ys jagan

తెలుగును సబ్జెట్ తప్పని సరి చేస్తూ.. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయనగరంలో సోమవారం 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారావసతి దీవెన సాయాన్ని జమ చేశారు. అంతర్జాతీయ స్ధాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా ఉండాలన్నారు. 'పేద, మధ్యతరగతి పిల్లల కోసం ఆలోచించే ప్రభుత్వంమని, మహిళా సాధికారికతకు కట్టుబడిన ఉందని అన్నారు. అలాగే రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధంతో అందరి జీవితాలలో మంచి మార్పులు వస్తాయని చెప్పారు.

దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా.. పేదల బతుకు మారలేదని వారి జీవితాలలో మార్పులు రావాలని ఆయన ఆకాక్షించారు. ఇంటర్ తర్వాత కళాశాలలో చేరేవారి సంఖ్య ఇతర దేశాల్లో 60శాతంపైగా ఉంటే భారత్ లో మాత్రం కేవలం 23 శాతం మాత్రమే ఉందన్నారు.

రాష్ట్రంలో నిరుపేదలకి ఉగాదికి 25 లక్షల‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. చంద్రబాబును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. ఏ తప్పు చేయకపోయినా.. రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోందిని పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షం కాదని రాక్షసులు ఉన్నారని సీఎం జగన్‌ విమర్శించారు. పోలీస్‌ బేరక్స్‌లో నూతనంగా నిర్మించిన దిశ పోలీస్‌స్టేషన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

Tags:    

Similar News