ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం జగన్ ప్రసంగం...
YS Jagan: కోవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది - జగన్
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం జగన్ ప్రసంగం...
YS Jagan: కొవిడ్ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ సమర్థంగా ఎదుర్కొందని సీఎం జగన్ అన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న జగన్.. వైద్యారోగ్య వ్యవస్థలపై మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆధునిక వైద్య సదుపాయాలు లేవని వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు.
ప్రభుత్వాలు ప్రివెంటింవ్ కేర్, క్యూరేటివ్ కేర్‌పై దృష్టి పెట్టాలని, వైద్యారోగ్య సేవలు అందించేందుకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. భోధనాసుపత్రులు పెంచడం ద్వారా వైద్యుల కొరత తీర్చాలనేది తమ లక్ష్యమన్నారు జగన్.