YS Jagan: టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan: పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు.

Update: 2021-04-30 11:28 GMT
వైెెఎస్ జగన్ ఫైల్ ఫోటో

YS Jagan: ఏపీలో పది,ఇంటర్ పరీక్షలపై రగడ కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని జాగ్రత్తలతో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సీఎం   జగన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. నిన్న కేరళలో పదో తరగతి పరీక్షలు పూర్తి చేశారని గుర్తు చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై కేంద్రం ఏ విధానాలు ప్రకటించలేదన్నారు సీఎం జగన్.. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని.. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలు పరీక్షలు రద్దు చేస్తూ.. పాస్ మార్కులను వేస్తున్నాయన్నారు.

 పరీక్ష రాసిన వారికి 70శాతం మార్కులు వస్తే.. వారికే మంచి కాలేజీలో సీట్లు వస్తాయన్నారు. పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50ఏళ్ల భవిష్యత్తు ఏంటనీ ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.. పరీక్షలను రద్దు చేయడం చాలా సులభమని.. పరీక్షల నిర్వహణ చాలా బాధ్యతతో కూడుకుని ఉన్నదని సీఎం జగన్ తెలిపారు. నాడు–నేడు మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు.

టెన్త్, ఇంటర్ పరీక్షల పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది.ఇది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమన్న కోర్టు పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తుంటే మీరెలా నిర్వహిస్తారని నిలదీసింది. కోవిడ్‌ బాధిత విద్యార్థులకు విడిగా పరీక్షలు పెడతామని ప్రభుత్వం తెలపగా విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకెలా తెలుస్తుందని ప్రశ్నించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ మే 3కి వాయిదా వేసింది.

Tags:    

Similar News