ఎన్‌పీఆర్‌పై సీఎం జగన్ సంచలన ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర‌్ణయం తీసుకున్నారు.

Update: 2020-03-03 14:09 GMT
YS Jagan File Photo

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర‌్ణయం తీసుకున్నారు. ఎన్‌పీఆర్(దేశ జనాభా పట్టిక) వ్యతిరేకంగా అసెంబ్లీలో సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. అడిగిన పలు ప్రశ్నలపై తమ ఏపీలో మైనారిటీల్లో ఆందోళన నెలకొందని సీఎం తెలిపారు. 2010లోని జనాభా పట్టికలోని అంశాలనే ఎన్‌పీఆర్‌లో తిరిగి పొందుపరచాలని కేంద్రాన్ని కోరుతామని వెల్లడించారు. కేంద్రం దానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని తెలిపారు. .

అయితే ఎన్‌ఆర్‌సీపై కూడా సీఎం స్పందించారు. ఎస్ఆర్సీ రాష్ట్రంలో అమలు చేయమని ఓ సభలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్పీఆర్ వ్యతిరేకంగా కీలక ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం-2019 ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఎన్ఆర్‌సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకెళ్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైసీసీ ఎమ్మెల్యే ముస్తఫా సైతం ప్రకటించారు.



 

Tags:    

Similar News