YS Jagan - Kadapa Tour: ప్రొద్దుటూరులో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. రూ.119 కోట్లతో..

YS Jagan - Kadapa Tour: ప్రొద్దుటూరులో రూ.515 కోట్లతో 9 అభివృద్ధి పనులకు శంకుస్థాపన 22,212 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలిచ్చామన్న సీఎం జగన్

Update: 2021-12-23 09:45 GMT

YS Jagan - Kadapa Tour: ప్రొద్దుటూరులో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. రూ.119 కోట్లతో..

YS Jagan - Kadapa Tour: కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కడప ప్రజలు తనను గుండెల్లో దాచుకున్నారని అందుకు ప్రతిఫలంగా తాను అభివృద్ధి చేసి చూపిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో 515 కోట్లతో 9 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో 500 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. 22వేల 212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. అలాగే మొదటి దఫా కింద 10వేల 828 మందికి ఇళ్లు కూడా కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.

మరోవైపు ప్రొద్దుటూరులో తాగునీటి సరఫరా కోసం 119 కోట్లతో నూతన పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. అలాగే 163 కోట్లతో నూతన డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రొద్దటూరు నుంచి ఆర్టీపీపీకి, స్టీల్ ప్లాంట్, హౌసింగ్ కాలనీకి చేరుకునేందుకు పెన్నా నదిపై 53 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మిస్తున్నామన్నారు. 4.5కోట్లతో ఆర్టీసీ బస్ స్టాండ్ అభివృద్ధి, 50 కోట్లతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు. అలాగే అనమయ్య ప్రాజెక్ట్ విషాదంలో ఇళ్లు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని సీఎంజగన్ హామీ ఇచ్చారు.

ఇక క్రిస్ మస్ వేడుకల కోసం సీఎం జగన్ పులివెందుల వెళ్లనున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ తన తండ్రికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత పులివెందులకు చేరుకుని ఇండ్రస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్‌లో ఆదిత్య బిర్లాయూనిట్‌కు శంకుస్ధాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక శనివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గోంటారు. ప్రార్ధనల తరువాత గన్నవరం బయలుదేరి వెళతారు.

Tags:    

Similar News