ఏపీ సీఎం జగన్ ఇవాళ,రేపు కడప జిల్లాలో పర్యటన
Kadapa Visit: పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ,రేపు కడప జిల్లాలో పర్యటన
Kadapa Visit: ఏపీ సీఎం జగన్ ఇవాళ, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందుల, వెంపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పులివెందుల చేరుకుని అక్కడి ప్రజలతో మమేకం అవుతారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ మోడల్ ప్లాంట్, న్యూ బయోటెక్ సైన్సెస్ లకు భూమి పూజ చేయనున్నారు. ఏపి కార్ల్ లోని ప్రధాన భవనంలో అధికారులతో సమావేశం అవుతారు. అక్కడి నుండి వేంపల్లికి చేరుకుంటారు.
నూతనంగా నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ పార్క్, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల భవనాలను ప్రారంభించి విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయకకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఎనిమిదవ తేదీ ఉదయం దివంగత వైఎస్సర్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి.. గుంటూరు బయల్దేరి వెళ్తారు. నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే వైఎసీపీ ప్లీనరీలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపధ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.