YS Jagan: నేడు కర్నూల్ కి సీఎం జగన్‌

Update: 2020-02-18 03:24 GMT

సీఎం అయ్యాక జగన్‌.. తొలిసారిగా ఇవాళ కర్నూలు జిల్లాకు వస్తున్నారు. ఉదయం 10 గంటలా 30 నిమిషాల నుంచి ఒంటిగంటా 30 నిమిషాలకు వరకు కర్నూల్‌లో ఉండనున్న జగన్‌ పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముందుగా ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కర్నూలులోని రెండవ ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు.

అక్కడ మూడో విడత కంటి వెలుగు, అవ్వ, తాతలకు కంటి పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడతలో 60 ఏళ్లు, ఆ పైబడిన మొత్తం 56,88,424 మంది అవ్వాతాతలకు స్క్రీనింగ్‌ (కంటి వైద్య పరీక్షలు) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 100 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆరోగ్య, వికాస కేంద్రాల నమూనా భవనానికి శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు 108 కోట్లకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News