Jagan Tour in Kadapa: రెండు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
*రేపు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం *వైఎస్‌ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస
ఏపీ సీఎం జగన్(ఫోటో- ది హన్స్ ఇండియా)
Jagan Tour in Kadapa: ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం పదిగంటలకు పులివెందుల లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులోని దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించనున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్నారు సీఎం జగన్.
సాయంత్రం 4.20నిమిషాలకు ఇడుపులపాయకు చేరుకుని రాత్రికి వైఎస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌజ్‌లో బస చేయనున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయకు నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకోనున్నారు గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం అనంతరం భాకరాపురం ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.