Andhra Pradesh: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై కలెక్టర్లకు డెడ్ లైన్?

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు.

Update: 2021-03-16 10:48 GMT

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. మే నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఉపాధిహామీ కింద మొదలుపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్స్‌ పనులను మార్చి 31లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఇక మిగిలిపోయిన ఇళ్లపట్టాల పంపిణీని పూర్తిచేయాలన్నారు సీఎం జగన్. కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి 90 రోజుల్లోగా పట్టాలివ్వాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా అర్హులైన వారికి ఇంటిస్థలం పట్టా అందాలన్నారు సీఎం. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్‌కూడా పూర్తిచేయాలని ఏప్రిల్‌ నుంచి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టిపెట్టాలని సూచించారు. తొలివిడతలో 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మించబోతున్నామని అందుకు అవసరమైన ప్రక్రియలను పూర్తిచేయాలన్నారు సీఎం. 

Tags:    

Similar News